ఎంటర్టైన్ మెంట్, ఎమోషనల్గా రంభా ఊర్వశి మేనక

ఎంటర్టైన్ మెంట్, ఎమోషనల్గా రంభా ఊర్వశి మేనక

అల్లరి నరేష్ హీరోగా నటించిన సోషియో ఫాంటసీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్ర మోహన్ చింతాడ దర్శకుడు.  రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు.  శుక్రవారం సినిమా రిలీజ్ సందర్భంగా అల్లరి నరేష్ చిత్ర విశేషాలను ఇలా పంచుకున్నారు.  

‘‘ఈ కథ వినగానే చాలా రోజుల తర్వాత మంచి కామెడీ ఎంటర్‌‌టైనర్ విన్నట్టుగా అనిపించింది. ప్రేక్షకులు కూడా నా నుంచి కామెడీ సినిమాలు మిస్ అవుతున్నారు. అలాంటి కథ ఇందులో కుదిరింది.  ఇందులో హీరోకు ఓ డ్రామా కంపెనీ ఉంటుంది. ఏమాత్రం కష్టపడకుండా సినిమా హీరో అయిపోవాలనుకునే క్యారెక్టర్‌‌‌‌.  తన కుటుంబానికి ముత్తాతల నుంచి వస్తున్న ఓ పుస్తకం ఉంటుంది.

అందులో ఒక ప్యాట్రన్ గీస్తే దేవతలు వచ్చి కోరికలు తీరుస్తారనేది నమ్మకం.  దేవతలు దీవిస్తే రాజమౌళి నెక్స్ట్ మూవీలో హీరో తానే అవుతానని ప్రయత్నాలు చేస్తుంటాడు. హీరో ఆ ప్యాట్రన్ ఎలా గీశాడు, రంభ ఊర్వశి మేనక వచ్చాక ఏం జరిగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో నాది చాలా ఎంటర్‌‌‌‌టైనింగ్ క్యారెక్టర్. నా బాడీ లాంగ్వేజ్ సరిపడే క్యారెక్టరైజేషన్‌‌, క్లీన్ కామెడీ ఇందులో ఉంటాయి.  ఫ్యామిలీ అందరూ కలిసి చూసేలా ఉంటుంది. కామెడీ కూడా చాలా ఆర్గానిక్‌‌గా ఉంటుంది. పెద్ద స్టార్ కాస్ట్‌‌తో మా నాన్నగారి స్టైల్‌‌లో చేసిన సినిమా.

ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ గారిది చాలా ఫన్ క్యారెక్టర్.  సినిమా ఆద్యంతం ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా ఉంటూనే ఓ మంచి ఎమోషన్‌‌ కూడా ఉంది.  ఇక ఇటీవల ఎక్కువ భారీ యాక్షన్‌‌ సినిమాలు ఎక్కువవడంతో ప్రేక్షకులు ఇలాంటి లైట్ హార్టెడ్‌‌ కామెడీ సినిమాలు కోరుకుంటున్నారు. అందుకే ఇకపై నేను రెండు కామెడీ సినిమాలు, ఒక సీరియస్ సినిమా చేస్తూ కెరీర్‌‌‌‌ను బ్యాలెన్స్ చేయాలని భావిస్తున్నాను.  ఇక ‘ఆల్కహాల్‌‌’ చిత్రం రిలీజ్‌‌కు రెడీగా ఉంది.  అలాగే ‘కనకదుర్గ’ షూటింగ్ జరుగుతోంది”.