అల్లరి నరేష్ హీరోగా నటించిన ఫాంటసీ కామెడీ డ్రామా 'రంభ ఊర్వశి మేనక చంద్ర. మోహన్ చింతాడ చర్చకుడు, రాజేష్ డండా. నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. సరేషకు జంటగా సురభి నటించగా.. రంభ, ఊర్వశి మేనక పాత్రల్లో రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా:సింగ్ నటించారు. గురువారం టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన ఈ పాటను ధనుంజయ్ సీపాన, సాహితి చాగంటి పాడారు.
"మా ఊరు ఎక్కడోస్వర్గముంది.. అది ఆకాశం అంచున ఇంటదండి దిగివచ్చాం పండగే చేసుకోండి.. రంభ, ఊర్వశి, మేనక ఇక స్టెప్పేస్తే తెల్లారు వేడుక. భూగోళం బద్దలై పోస్టిక.." అంటూ సురేష్ జనిశెట్టి రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. సాంగ్ లాంచ్ ఈవెంట్లో రాశీసింగ్ మాట్లాడుతూ నేను నటించిన చిత్రాల్లో ఇది చాలా డిఫరెంట్ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. చక్కని ఎంటర్టైన్ మెంట్ ఉంటుంది" అని చెప్పింది. విష్ణుప్రియ మాట్లాడుతూ 'ఇప్పటివరకు మనసినిమాల్లోరంభ, ఊర్వశి, మేనకలు ఓ పాటలో, సీన్లో రావడం చూసుంటాం కానీ ఇది వాళ్లముగ్గురు చుట్టూ జరిగే కథ ఇలాంటి సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా" అని చెప్పింది. థియేటర్లో అందరూ బాన్స్ చేసే పాట ఇదని ప్రికా సింగ్ చెప్పింది. సెప్టెంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.
