అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్

విభిన్న కథలు, మంచి కంటెంట్‌‌‌‌తో  ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ వస్తున్న  అల్లరి నరేష్,  తనను స్టార్ హీరోగా నిలబెట్టిన కామెడీ జానర్‌‌‌‌లో మరోసారి సందడి చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం  ఆయన నటిస్తున్న 65వ సినిమా ‘రంభ ఊర్వశి మేనక’.  చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్నాడు.  అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఆగస్టు 10న టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయనున్నట్టు అప్‌‌‌‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ అనౌన్స్‌‌‌‌మెంట్  పోస్టర్‌‌‌‌‌‌‌‌లో అల్లరి నరేష్  దేవుడి మాలలో  
కనిపిస్తుండటం, వెనుక హీరోయిన్ సురభి  చిరునవ్వులతో ఉండటం   ఫీల్ గుడ్ వైబ్‌‌‌‌ని తీసుకొచ్చింది.  టీజర్‌‌‌‌‌‌‌‌పై ఆసక్తిని పెంచింది.   వెన్నెల కిషోర్, నరేష్ వి.కె., శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్  ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.  సెప్టెంబర్ 4న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా సినిమా విడుదల కానుంది.