రిస్క్ చేస్తున్న అల్లు అర్జున్.. పుష్ప తరువాత బోయపాటితోనేనట!

రిస్క్ చేస్తున్న అల్లు అర్జున్.. పుష్ప తరువాత బోయపాటితోనేనట!

పుష్ప(Pushpa) సినిమా తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) రేంజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ఆ సినిమా సాధించిన విజయంతో ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ఇక పుష్ప సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకోవడం కూడా అల్లు అర్జున్ స్థాయిని పెంచేసింది. అందుకే ఆయన తరువాతి సినిమాల గురించి చిన్న న్యూస్ వినిపించిన క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. అందుకే బన్నీ కూడా చాలా ఆచితూచి సినిమాలను సెలెక్ట్ చేస్తున్నారు. 

అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన సుకుమార్ తో పుష్ప సీక్వెల్ పుష్ప2లో నటిస్తున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. అంతేకాదు.. పుష్ప2 నుండి రిలీజ్ అవుతున్న పోస్టర్ ఆ అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. అందుకే గతలో ఏ సినిమాకు జరగనంత బిజినెస్ పుష్ప2 కు జరుగుతోంది. మేకింగ్ కూడా పూర్తి కాకుండానే ఏకంగా రూ.1000 కోట్ల బిజినెస్ జరుగుతుందట పుష్ప2 సినిమాఫై ఇవన్నీ చూస్తుంటే పుష్ప2 సినిమాతో అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయబోతున్నాడట అర్థమవుతోంది. 

ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. బన్నీ తీసుకున్న ఒక నిర్ణయం ఆయన ఫ్యాన్స్ ను కలవర పెడుతోంది. అదేంటంటే.. పుష్ప2 తరువాత అల్లు అర్జున్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయనున్నారట. ఈ న్యూస్ ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కారణం.. బోయపాటి సినిమాల్లో మాస్ అంశాలు తప్పా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ ఉండదు.

పుష్ప తరువాత ఈ రేంజ్ క్రేజ్ వచ్చిన తరువాత కాన్సెప్ట్ ఉండేలా సినిమాలు చేయాలని కానీ.. మళ్ళీ మాస్ మసాలా సినిమాలంటే జనాలు యాక్సప్ట్ చేయడం కష్టం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పోనీ బోయపాటి ట్రాక్ ఏమైనా బాగుందా ఆంటీ అది లేదు. ఇటీవల ఆయన నుండి వచ్చిన స్కంద మూవీ భారీ ప్లాప్ గా నిలిచింది. ఇలాంటి సమయంలో బోయపాటితో సినిమా చేయడమే అంటే రిస్క్ అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ కాంబో నిజంగా సెట్ అవుతుందా? బన్నీ బోయకి ఛాన్స్ ఇస్తాడా? అనేది చూడాలి.