మంచు లక్ష్మికి క్రేజీ ఛాలెంజ్ విసిరిన బన్నీ.. ఒక నెలంతా అలా!

మంచు లక్ష్మికి క్రేజీ ఛాలెంజ్ విసిరిన బన్నీ.. ఒక నెలంతా అలా!

పుష్ప హిట్ తరువాత అల్లు అర్జున్(Allu Arjun) క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. గ్లోబల్ రేంజ్ లో ఆయన సినిమాలపై భారీ బజ్ క్రియేట్ అవుతోంది. మరీ ముఖ్యంగా నార్త్ లో మరేహీరోకీ కూడా సాధ్యం కానీ ఫాలోయింగ్ ను సాంపాదించుకున్నాడు అల్లు అర్జున్. అందుకే ఆయన తరువాతి సినిమా పుష్ప2 పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఎంతలా అంటే.. కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్ల వరకు  అయ్యేంతలా.

ఇదిలా ఉంటే.. ఓపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉంటారు అల్లు అర్జున్. ఇందులో భాగంగానే తాజాగా ఆయన నటి మంచు లక్ష్మికి క్రేజీ ఛాలెంజ్ ఇచ్చారు. ఒక నెల పాటు అన్నం, నాన్ వెజ్ తినకుండా ఉండాలంటూ ఆమెకు ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మంచు లక్ష్మి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అల్లు అర్జున్ నా గోల్స్ ను పబ్లిక్‌తో షేర్ చేసుకోవాలని తెలిపారు. ఆ ఛాలెంజ్ ను నేను అంగీకరిస్తున్నాను. నేను ఒక నెల పాటు రైస్, నాన్ వెజ్‌ తినకుండా ఉండాలన్న ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నా. అవి రెండు నాకు ఫేవరెట్.. అంటూ రాసుకొచ్చారు మంచు లక్ష్మి. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక ఈ ఇద్దరి సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 మూవీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మంచు లక్ష్మి విషయానికి వస్తే.. ఆమె అగ్ని నక్షత్రం అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నారు. వంశీ కృష్ణ మల్ల దర్శకత్వలో వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది థియేటర్స్ లోకి రానుంది.