ఇంట్లో పని అమ్మాయికి రీల్ చేసిన బన్నీ..రాకెట్లా వచ్చేసిన సబ్ స్క్రైబర్స్

ఇంట్లో పని అమ్మాయికి రీల్ చేసిన బన్నీ..రాకెట్లా వచ్చేసిన సబ్ స్క్రైబర్స్

సోషల్ మీడియా అంటే ఏంటో అందరికీ అర్ధమైపోయింది. ప్రస్తుత కాలంలో ఒక్క పోస్ట్ తో క్రేజీ స్టార్స్ గా మారిపోయేవాళ్లు ఉన్నారు. అది ఎంతలా ప్రభావితం అయితే..అంతే రేంజ్ లో పాపులర్ గా ఎదగడం చూస్తున్నాము.కొంతమంది సరదాగా వీడియోస్ పోస్ట్స్ చేస్తూ..తమ ఆనందాన్ని షేర్ చేసుకునేవాళ్ళు ఉంటారు. అంతేకాకుండా విలువైన సమాచారాన్ని ఇవ్వడానికి ట్రై చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అలాంటి దారిలోనే అల్లు అర్జున్ ఇంట్లో ఒకరు ట్రై చేస్తున్నారు. ఎవరై ఉంటారని అనుకుంటున్నారా? ఎందుకంటే అల్లు ఫ్యామిలీ అంటేనే ఫేమస్ హౌస్. ఇక ఆ హౌస్లో ఫేమస్ అవ్వని వారు ఎవరై ఉంటారని ఆలోచిస్తున్నారా? మరి వారేవరో తెలుసుకుందామా.. 

ఇటీవలే తెలంగాణ ఎన్నికల్లో అల్లు అర్జున్ ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటో ఇన్స్టాలో పోస్ట్ చేసిన బన్నీ..అయితే ఇదే టైంలో అశ్విని అనే అమ్మాయితో సెల్ఫీ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ వీడియోలో ఏముందా అని చూస్తే..ఆ అమ్మాయి అల్లు అర్జున్ ఇంట్లో పనిమనిషి అని తెలిసింది. తనకు సోషల్ మీడియాలో పలు అకౌంట్స్ ఉన్నప్పటికీ ఫేమస్ అవ్వడానికి..అల్లు అర్జున్ సపోర్టు కోరుకోవడంతో ఈ వీడియో చేసినట్టు తెలుస్తోంది. 

ఈ వీడియోలో అల్లు అర్జున్ మాట్లాడుతూ..'నీకు బాగా ఫాలోవర్స్ రావాలని మంచి వీడియో తీస్తా సరేనా, ఎంతమంది ఫాలోవర్స్ కావాలి? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు?' అని అడగ్గా..ఆ అమ్మాయి 13k అని చెప్పింది. 'మినిమం ఎంత టచ్ అవ్వాలి?' అని బన్నీ అడగ్గా..30k అని ఆ అమ్మాయి చెప్పడం..ఈ వీడియోతో వస్తారా? అని అల్లు అర్జున్ అడగం క్యూట్‌గా నవ్వుతూ సరదాగా తీసిన వీడియో ఇపుడు వైరల్ అవుతోంది.

ఈ వీడియోను అశ్విని ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసినపుడు ఆమె ఫాలోవర్ల సంఖ్య 14.7K వద్ద ఉంది. ఇక అల్లు రాకతో ఒక్కసారిగా 40.7K  సబ్ స్క్రైబర్స్ తో కళకళలాడుతోంది. అశ్విని అనుకున్న దాన్ని కంటే ఎక్కువగానే సంఖ్య పెరుగుతుండటంతో అల్లు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ చిన్న వీడియోతో బన్నీ చేసింది చిన్న సాయం అయిన..ఆ వీడియోలో ఉన్న అశ్విని కళ్ళలో కనిపించే సంతోషం చాలా పెద్దది. 

ఇక అల్లు అర్జున్..70 ఏళ్ళ తెలుగు సినీ చరిత్రలో ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు అందుకున్న..తొలి తెలుగు హీరోగా రికార్డ్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు.