Allu Arjun Tweet: యానిమల్ హీరోయిన్ గుండెలను బ్రేక్ చేస్తోంది..

Allu Arjun Tweet: యానిమల్ హీరోయిన్ గుండెలను బ్రేక్ చేస్తోంది..

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా మోస్ట్ వైల్డ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్ లో వచ్చిన మూవీ యానిమల్(Animal). డిసెంబర్ 1న రిలీజైన మూవీ..వారం అయిన థియేటర్స్ లో దూసుకెళ్తోంది. రిలీజైన రెండోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించి బాక్సాపీస్ను షేక్ చేస్తోంది. ఈ వైల్డ్ యాక్షన్‌ థ్రిల్లర్‌ రోజురోజుకు ఆడియన్స్ పై గట్టి ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా..ఇండియన్ టాప్ సెలబ్రెటీస్పై కూడా అదిరిపోయే ఇంపాక్ట్ చూపిస్తోంది.

లేటెస్ట్గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) యానిమల్ మూవీపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా క్లాసిక్ మూవీస్ జాబితాలోకి చేరిందన్నారు. ఇందులో లీడ్ రోల్స్ ప్లే చేసిన రణబీర్, రష్మిక, బాబీ డియోల్, అనిల్ కపూర్ లు తమ నటనతో ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని అల్లు అర్జున్ తెలిపారు.

అందులో భాగంగా హీరో రణబీర్ కపూర్ ఇండియన్ సినిమా ఎక్స్ పీరియన్స్ను వేరే లెవల్ కు తీసుకువెళ్లాడు. చాలా ఇన్స్ ఫైరింగ్ అనిపించింది, మీ మ్యాజిక్తో నా నోట మాటలు రావడం లేదు. రష్మిక, బ్రిలియంట్గా నటించావ్ ఇప్పటి దాకా నీ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇది, ఇంకా ఇలాంటివి మరెన్నో చేయబోతున్నావని అర్ధం అవుతోంది. యంగ్ హీరోయిన్ తృప్తి గుండెలను బ్రేక్ చేస్తోంది, ఇంకా చేస్తుందని భావిస్తున్నాను. మిగతా అందరు నటీనటులు, టెక్నీషియన్లు కూడా సినిమాను మరో లెవల్కి తీసుకు వెళ్లారు, వాళ్లందరికీ కంగ్రాట్స్.

అంతేకాకుండా మునుపెన్నడూ చూడని సీన్లని సందీప్ తన స్క్రీన్ ప్లేతో అద్భుతంగా చూపించడం బాగుంది. ఇంకా తన ఫీలింగ్ ని వర్ణించేందుకు మాటలు సరిపోట్లేదని అల్లు అర్జున్ అన్నారు. ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగా అందరినీ గర్వించేలా చేశారని ట్వీట్లో తెలిపారు బన్నీ. 

ఇప్పటికే ఈ వైల్డ్ యాక్షన్ సినిమాపై డైరెక్టర్స్ రామ్ గోపాల్ వర్మ, హరీష్ శంకర్ ఇంకా పలువురు సెలబ్రేటిస్ తమ ఫీలింగ్స్ ను షేర్ చేసుకున్నారు.లేటెస్ట్ గా అల్లు అర్జున్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

యానిమల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ సినిమా.కలెక్షన్స్ రోజు రోజుకు అమాంతం పెరుగుతూ వస్తున్నాయి.అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాల తర్వాత ఐదేళ్ల గ్యాప్ తీసుకున్న సందీప్..మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద తన మార్క్ రిపీట్ చేశాడు.