పుష్ప2 కోసం ఇండియాలోనే టాప్ రెమ్యునరేషన్.. ఇది కదా బ్రాండ్ అంటే!

పుష్ప2 కోసం ఇండియాలోనే టాప్ రెమ్యునరేషన్.. ఇది కదా బ్రాండ్ అంటే!

పుష్ప(Pushpa) సినిమా తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) రేంజ్ మొత్తం మారిపోయింది. ఈ సినిమాలో తన నటనకు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమాలో పాటలు, అందులో అల్లు అర్జున్ డాన్స్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికి కూడా సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి ఆ మూమెంట్స్. సినిమా వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ మ్యానియా తగ్గలేదు అంటే అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ ఇంపాక్ట్ ఎలా ఉందా అని. ఇటీవల పుష్ప సినిమాకు గాను జాతీయ అవార్డు అందుకున్నారు బన్నీ. దీంతో అల్లు అర్జున్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది.

ఇందులో భాగంగానే అల్లు అర్జున్ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. పుష్ప2 కోసం ఇండియాలో అందరికన్నా టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట అల్లు అర్జున్. ఆ విషయంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ను సైతం దాటేశారట. ఇప్పటివరకు ఇండియాలో టాప్ రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ గా రికార్డ్ క్రియేట్ చేశారు. ఆయన ఒక్కో సినిమాను రూ.210 కోట్లు తీసుకునే వారు. కానీ పుష్ప2 కోసం అల్లు అర్జున్ ఏకంగా.. రూ.330 కోట్ల భారీ రెమ్యునరేషన్ ను తీసుకోనున్నారట. ప్రస్తుతం ఈ వార్త ఇండియన్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ పర్ఫెక్ట్ గ్లోబల్ స్టార్ అంటే ఐకాన్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది మా అల్లు అర్జున్ బ్రాండ్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.