Pushpa 2: పుష్ప 2 లీక్..చీరలో అల్లు అర్జున్ మాస్ జాతర

Pushpa 2: పుష్ప 2 లీక్..చీరలో అల్లు అర్జున్ మాస్ జాతర

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప ది రూల్(Pushpa the rule). క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. పుష్ప 2 సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఆల్రెడీ సెకండ్ పార్ట్ గ్లింప్స్, పోస్టర్ రిలీజ్ అయ్యి అంచనాలు అమాంతం పెంచేశాయి. అంతేకాకుండా..ఈ సినిమా లీక్స్ కూడా మధ్య మధ్యలో దర్శనం ఇస్తూ..ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి.  

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ప్రసెంట్ పుష్ప ది రూల్ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లోని ఐకానిక్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. కీలక యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే, ఇక్కడ గంగమ్మ జాతర సీన్స్ ను షూట్ చేస్తున్నట్లు సమాచారం. అందులో గంగమ్మ తల్లిగా కనిపించబోతున్నాడట అల్లు అర్జున్. అయితే, కొందరు షూటింగ్ స్టిల్స్ ను లీక్ చేస్తున్నారు. నిన్న (జనవరి 29న) సెట్ లో ఉన్నపుష్ప రాజ్ ఫోటో లీక్ చేసేశారు. అల్లు అర్జున్ ఫోటో లీక్ అవ్వడంతో పుష్ప2 మేకర్స్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా ఉండేలా కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారట మేకర్స్. తాజాగా లీకైన ఎపిసోడ్ టోటల్ సినిమాకే హైలెట్ అవుతుందనే టాక్. 

డైరెక్టర్ సుకుమార్‌ రైటింగ్స్‌..మైత్రీ మూవీమేకర్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాని ఆగస్టు 15న విడుదల చేస్తామని గతంలోనే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇక రీసెంట్ గా ఈ సినిమా మరో 200 రోజుల్లో రానుందంటూస్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చశారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ, సునీల్‌, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.