Allu Arjun: బేబీ నిర్మాత SKN ఇంటికి..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Allu Arjun: బేబీ నిర్మాత SKN ఇంటికి..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

టాలీవుడ్లో చిన్న సినిమాగా తెరకెక్కి..పెద్ద సక్సెస్ అందుకున్న మూవీ బేబీ(Baby). ఈ సినిమాతో నిర్మాత SKN (శ్రీనివాస కుమార్) ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు.

ఇదిలా ఉంటే..ఇటీవలే (జనవరి 4న) SKN తండ్రి గాదె సూర్య ప్రకాశరావు  అనారోగ్యం కారణంగా కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో SKN ఫ్యామిలీ మెంబర్స్ను పరామర్శించేందుకు ఇవాళ (జనవరి 23న) స్టార్ హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) ఎస్‌కేఎన్ నివాసానికి వెళ్లారు. అక్కడ సూర్య ప్రకాశరావు చిత్రపటంపై పూలు చల్లి అల్లు అర్జున్ నివాళులర్పించాడు.

ఇలాంటి కష్టసమయంలో మా ఇంటికి వచ్చి..మీ మంచి మనసుతో ధైర్యం చెప్పి..మాకు మద్దతుగా నిలిచిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ధన్యవాదాలు. మీ రాకకు, మీరు చూపిస్తున్న ఆదరణకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు..SKN అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్  ఎస్‌కేఎన్‌ను పరామర్శించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మెగాస్టార్ అభిమానిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నిర్మాతగా SKN..కెరీర్ మొదట్లో కొన్ని సినిమాలకు డిస్ట్రీబ్యూటర్ గా వర్క్ చేశారు. ఇక ఆ తర్వాత అల్లు అరవింద్ సహకారంతో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.

విజయ్ దేవరకొండతో కలిసి టాక్సీవాలా, కలర్ ఫోటో, ప్రతి రోజు పండుగే, బేబీ మూవీస్ ను నిర్మించాడు.ఆనంద్ దేవరకొండతో తీసిన బేబీ మూవీ మంచి సక్సెస్ ను ఇచ్చింది. దీంతో స్టార్ ప్రొడ్యూసర్గా మారి ప్రస్తుతం పలు సినిమాలను నిర్మిస్తున్నాడు.