ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

పుష్ప మూవీతో ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు పొందిన   ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో సందడి చేశారు. ఇంటర్నేషనల్  డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకునేందుకు  అల్లు అర్జున్ మార్చి 20న  ఖైరతాబాద్‌ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. 

అల్లు అర్జున్ రాకతో ఆర్టీఏ ఆఫీసులో సందడిగా మారింది.  ఆర్టీఏ ఆఫీసులో అధికారులను కలిసి  ఫార్మాలిటీస్ ప్రకారం డాక్యుమెంట్స్ ఫిల్ చేసి సైన్ చేశారు అల్లు అర్జున్ .ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  అల్లు అర్జున్ ను చూసేందుకు   జనం భారీగా గుమిగూడారు.  సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు.  కాసేపు ఆర్టీఏ ఆఫీస్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Also Read: AI నేర్చుకోండి..ఎంత కావాలంటే అంత జీతం