వరుణ్, లావణ్యకు అల్లు ఫ్యామిలీ మెగా పార్టీ.. వైరల్ అవుతున్న ఫొటోస్

వరుణ్, లావణ్యకు అల్లు ఫ్యామిలీ మెగా పార్టీ.. వైరల్ అవుతున్న ఫొటోస్

టాలీవుడ్ లవ్‌బర్డ్స్‌ వరుణ్‌(Varun tej), లావణ్య(lavanya) త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. జూన్‌ లో ఎంగేజ్‌మెంట్ జరుపుకున్న ఈ జంట.. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. దీనికి సంబందించిన పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. పెళ్లి డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు కానీ..  నవంబర్‌ 1న డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ను ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. అది కూడా ఇటలీలో. ఎంతో ఘనంగా జరగనున్న ఈ పెళ్లి వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారని టాక్.

ఇటీవల ఈ జంట ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ జరిగిన విషయం విష‌యం తెలిసిందే. ఈ పార్టీని మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ జంటకు అల్లు ఫ్యామిలీ పార్టీ ఇచ్చింది. అల్లు వారింట జరిగిన ఈ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి, నాగ‌బాబు, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్.. అల్లు ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ సభ్యులంతా హాజరయ్యారు. అంతేకాదు ఇండస్ట్రీ నుండి హీరో నితిన్, ఆయన భార్య, రీతూ వర్మ కూడా అటెండ్ అయ్యారు. ప్ర‌స్తుతం ఈ పార్టీకి సంబందించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.