Allu Arjun Birthday:గ్రాండ్గా అల్లు అర్జున్ బర్త్డే పార్టీ..స్టన్నింగ్ లుక్‌లో భార్య స్నేహ రెడ్డి

Allu Arjun Birthday:గ్రాండ్గా అల్లు అర్జున్ బర్త్డే పార్టీ..స్టన్నింగ్ లుక్‌లో భార్య స్నేహ రెడ్డి

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటే అల్లు అర్జున్(Allu Arjun..Sneha Reddy)స్నేహారెడ్డి అనడంలో సందేహం లేదు. స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగా గుర్తింపు పొందుతూనే..సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్లను పెంచుకుంటోంది.అల్లు అర్జున్ బర్త్డే స్పెషల్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసింది అల్లు స్నేహారెడ్డి.వివరాల్లోకి వెళితే..

ఐకాన్ పుట్టినరోజు వేడుకలను ఆదివారం అర్ధరాత్రి అతని భార్య అల్లు స్నేహా రెడ్డి తమ ఇంట్లోనే గ్రాండ్గా సెలబ్రేట్ చేసింది.ఈ వండర్ ఫుల్ ఈవెంట్కి ఫ్రెండ్స్,ఫ్యామిలీ మెంబర్స్ అటెండ్ అయ్యారు.

ఈ ఈవెంట్లో ప్రత్యేకంగా అట్ట్రాక్ట్ చేసిన విషయాలు ఏంటంటే..అల్లు అర్జున్ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన కేక్ అండ్ స్నేహా రెడ్డి వైట్ డ్రెస్సులో అదిరిపోయే లుక్.స్నేహ తనదైన అందంతో హీరోయిన్స్ ని మించి ఉండటంతో ఫ్యాన్స్ వావ్ అంటున్నారు.ప్రస్తుతం ఈ బర్త్ డే  పార్టీకి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే..

ప్రస్తుతం బన్నీ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప 2 సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.అలాగే అల వైకుంఠపురంలో తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ మరోసారి జతకడుతున్నారు. ఇక ఈ కాంబోలో ఇప్పటికే జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి,అల వైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.డైరెక్టర్ అట్లీతో ఒక ప్రాజెక్ట్ చర్చలో ఉన్నట్టు సమాచారం.