సెహరి టీజర్ టైమ్ ఫిక్స్

సెహరి టీజర్ టైమ్ ఫిక్స్

సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్ అనేది ట్యాగ్‌‌లైన్.  సునీల్, అక్షర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌తో పాటు ఇందులోని పాత్రలను పరిచయం చేశారు మేకర్స్. తాజాగా టీజర్‌‌‌‌కు టైమ్ ఫిక్స్ చేశారు.  

ఈ నెల 27న ‘పవర్ ఆఫ్ సుబ్రమణ్యం’ పేరుతో టీజర్‌‌‌‌ను రిలీజ్ చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సుధీర్ బాబు కెరీర్‌‌‌‌లో హై బడ్జెట్‌‌ మూవీ ఇదని చెబుతున్నారు మేకర్స్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.