తల్లికాబోతున్న అమలాపాల్‌.. వైరల్ అవుతున్న ఫొటోస్

తల్లికాబోతున్న అమలాపాల్‌.. వైరల్ అవుతున్న ఫొటోస్

ప్రముఖ నటి అమలా పాల్‌ (Amala Paul) తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు. బీచ్‌లో బేబీ బంప్‌తో ఫొటోలను షేర్‌ చేస్తూ.. మేమిద్దరం ముగ్గురం కాబోతున్నాం.. అనే లవ్లీ కొటేషన్ ఇచ్చారు. అమల పాల్ చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్‌ అయ్యింది. ఈ పోస్ట్ చూసిన ఆమె ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెకు కంగ్రాట్స్‌ చెబుతూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక అమలా పాల్ విషయానికి వస్తే.. మాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఈ బ్యూటీ తెలుగులో వరుస అవకాశాలు అందుకొని మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఇక 2014లో దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ను పెళ్లి చేసుకొని.. 2017లో వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకుంది. అలా దాదాపు ఆరేళ్ళు ఒంటరిగానే ఉన్న అమలా పాల్ తన లేటెస్ట్ బాయ్‌ఫ్రెండ్‌, టూరిజం, హాస్పిటాలిటీ ప్రొఫెషనల్‌ జగత్‌ దేశాయ్ (Jagat Desai)‌‌ను పెళ్లి చేసుకుంది. 2023 నవంబర్‌ మొదటివారం కోచిలో ఈ జంట వివాహంచేసుకున్నారు. ఇక రెండు నెలల గ్యాప్ లోనే తల్లి కాబితున్నట్లు ప్రకటించి తన అభిమానులకు షాకిచ్చారు.