ట్రాక్ ఎక్కిన అమర్ గేమ్.. గెలిచి సత్తా చాటాడు.. పొగడ్తలతో ముంచెత్తిన శివాజీ

ట్రాక్ ఎక్కిన అమర్ గేమ్.. గెలిచి సత్తా చాటాడు.. పొగడ్తలతో ముంచెత్తిన శివాజీ

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లో ఎంత కష్టపడ్డా అదృష్టం కలిసిరాని కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది అమర్(Amar deep) అనే చెప్పాలి. అది తన అమాయకత్వమా లేక తన బిహేవియరే అంతనా అని చాలామంది అనుకున్నారు. వరుసగా ఫౌల్ గేమ్స్ ఆడుతూ, నాగార్జున(Nagarjuna)తో చీవాట్లు తింటూ ప్రతీ వారం నామినేషన్స్ లో నిలుస్తూ వచ్చాడు. కానీ.. ఆడియన్స్ మాత్రం మనోడిని సేవ్ చేస్తూనే వస్తున్నారు. 

ఇక ఇంట్లో శివాజీ(Shivaji), అమర్ మధ్య జరిగే గొడవల గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. అది వారవారం ఉండేదే. మొన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో కూడా ఇది కంటిన్యూ అయ్యింది. దీంతో ఈ ఇద్దరు కలిసి ఆట ఆడటం జరగని పని అనే క్లారిటీకి వచ్చేశారు ఆడియన్స్. అయితే తాజాగా జరిగిన గేమ్ లో దీనికి పూర్తి భిన్నంగా జరిగింది. అం,అమర్ అంటే అస్సలు పడని శివాజీ.. అతన్ని పొగడ్తలతో ముంచెత్తాడు దానికి అమర్ కూడా శివాజీని గట్టిగా హత్తుకున్నాడు. ఈ ఇద్దరు ఇలా పాజిటీవ్ గా ఉండటంతో ఆడియన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం క్యాప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అందులో భాగాంగా ఇచ్చిన టాస్క్ లో.. ఒక వస్తువుని బోర్డు పై జారవిడుస్తు.. కింద ఉన్న హోల్ లో సరిగా పడేలా చేయాలి. ఈ టాస్క్ లో అమర్, శోభా పాల్గొన్నారు. ఈ టాస్క్ లో శోభా కన్నా ముందుగా టాస్క్ కంప్లీట్ చేసి బెల్ మోగించాడు అమర్. దీంతో అమర్ టీమ్ సభ్యుడైన శివాజీ పరిగెత్తుకుంటూ వచ్చి అమర్ ను  హగ్ చేసుకుకున్నాడు. నువ్వు గెలిచావురా అంటూ ప్రశంసలు కురిపించాడు. సీజన్ 7 మొదలైనప్పటినుండి అమర్ విషయంలో శివాజీ పాజిటీవ్ గా మాట్లాడటం ఇదే మొదటిసారి కావడం విశేషం. దీంతో ఈ సీన్ చూసిన ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ALSO READ :- అదిరేటి అందం కోసం.. ముఖం దీపంలా వెలగాలంటే.. పాటించాల్సిన చిట్కాలు ఇవే. . .