హారర్ జానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమరావతికి ఆహ్వానం

హారర్ జానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమరావతికి ఆహ్వానం

శివ కంఠమనేని, ధ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్య బాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రీష్  లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జీవీకే తెరకెక్కించిన చిత్రం ‘అమరావతికి ఆహ్వానం’.  కెఎస్ శంక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ఆర్ వెంక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టేశ్వర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు  నిర్మించారు. ఫిబ్రవరి 13న సినిమా రిలీజ్. శుక్రవారం నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అతిథిగా హాజరైన నటుడు మురళీ మోహన్ ఇలాంటి చిన్న చిత్రాలకు పెద్ద విజయం దక్కాలని  కోరారు. 

హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ ‘ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గారు అన్నట్లు సినిమా అనుకున్న బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేయడమే సగం సక్సెస్. అలా మా సినిమాను  అనుకున్న బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంప్లీట్ చేశాం.  మా సినిమాలో ఎస్తేర్, ధన్య, సుప్రియ.. దెయ్యాల పాత్రల్లో భయపెడతారు’ అని అన్నాడు.  హారర్ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు  అన్ని కమర్షియల్ అంశాలతో ఆకట్టుకుంటుందని ఎస్తేర్ చెప్పింది. హారర్ జానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అందరికీ నచ్చేలా తమ చిత్రం ఉంటుందని దర్శకనిర్మాతలు తెలిపారు.