వచ్చాక మీరేం పీకారు.. మళ్ళీ నోరుజారిన అమర్.. ఫైర్ అవుతున్న ఆడియన్స్

వచ్చాక మీరేం పీకారు.. మళ్ళీ నోరుజారిన అమర్.. ఫైర్ అవుతున్న ఆడియన్స్

బిగ్‌బాస్‌(Bigg boss)లో వీకెండ్ ఎపిసోడ్స్ ఇంతా ఎంటర్టైన్ చేస్తాయో తెలియదు కానీ.. సోమవారం నామినేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఆడియన్స్ ను ఫుల్లుగా ఎంటర్టైన్ చేస్తారు కంటెస్టెంట్స్. ఈ సీజన్ అయితే మరీ ఎక్కువ. నామినేషన్స్ అనగానే రెచ్చిపోతున్నారు. కొన్నిసార్లు నోరు కూడా జారుతున్నారు. 

ఆ విషయంలో హోస్ట్ నాగార్జున ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా తీరు మాత్రం మార్చుకోవడం లేదు. ఈ విషయంలో మొన్న జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జునతో చివాట్లు తిన్నాడు అమర్ దీప్. అయినా కూడా మనోడి వాలకం మాత్రం మారలేదు. నిన్న జరిగిన నామినేషన్స్ లో కూడా మరోసారి నోరుజారి ఓ మాట అనేశాడు అమర్. 

నిన్న జరిగిన నామినేషన్స్‌లో భాగంగా..  అమర్‌దీప్‌ని నామినేట్ చేస్తూ భోలే.. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో నేను మాట్లాడితేనే కుర్చీని తన్నావ్.. అసలు నాపైన అంత కోపం తెచ్చుకోవాల్సిన అవసరం నీకేంటి తమ్ముడూ అని అడిగాడు. తర్వాత కప్పు కొడతా అన్నావ్.. సూపర్ కప్పు కొట్టుకో.. కానీ మిగతాదంతా తప్పు అంటున్నా అని అన్నాడు భోలే. దానికి అమర్.. మొన్న నేను మిమ్మల్ని నామినేట్ చేశానని ఈ వారం రివెంజ్ నామినేషన్ చేస్తున్నారు అని అంటూ.. కోపంతో పక్కనున్న మెట్టును తన్నాడు. దానికి భోలే.. నువ్వు మళ్లీ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తున్నావని అన్నాడు. దానికి అమర్ మాట్లాడుతూ.. ఇంట్లోకి రాగానే మీరే నన్ను ఫస్ట్ నామినేట్ చేసారు అన్నాడు.  మరి ఆన్సర్ ఇచ్చాక అక్కడితో ఎందుకు ఆగిపోలేదు.. అంటూ కొశ్చన్ చేశాడు భోలే. వచ్చాక మీరు ఏం పీకారు.. మీరే ఆగాలి.. అంటూ మరోసారి నోర్ జారాడు అమర్. ఏంటీ పీకారా..అని భోలే అడగగా..  సైలెంట్ అయిపోయాడు అమర్. 

అయితే దీనిపై ఆడియన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. అమర్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మొన్ననే కదా నాగార్జున నోరు అదుపులో పెట్టుకోమని చెప్పారు.. ఇక నువ్వు మారవా అంటూ ఆడేసుకుంటున్నారు.