V6 News

దేశంలో 100 సిటీలకు విస్తరించిన అమెజాన్నౌ

దేశంలో 100 సిటీలకు విస్తరించిన అమెజాన్నౌ

హైదరాబాద్​, వెలుగు: అమెజాన్ తన క్విక్ డెలివరీ సేవలను భారీగా విస్తరిస్తోంది. అమెజాన్ నౌ పేరుతో అందిస్తున్న ఈ సర్వీసులను దేశవ్యాప్తంగా 100 నగరాలకు చేర్చనున్నట్లు సంస్థ ప్రకటించింది. గతంలో ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవలను పుణె, హైదరాబాద్, చెన్నై, కోల్ కతా వంటి ప్రధాన నగరాలకు విస్తరించింది.

దీని కోసం సంస్థ సుమారు రూ.2,800 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఫాస్ట్​డెలివరీల కోసం వెయ్యి మైక్రో ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఈ విస్తరణ వల్ల సుమారు 16 వేల మంది రైతులు లాభపడతారని అమెజాన్ తెలిపింది.