Ambajipeta Marriage Band: OTTకి అంబాజీపేట మ్యారేజీ బ్యాండు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Ambajipeta Marriage Band: OTTకి అంబాజీపేట మ్యారేజీ బ్యాండు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సుహాస్(Suhas) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజీ బ్యాండు(Ambajipeta Marriage Band). యంగ్ బ్యూటీ శివాని నాగారం(Shivani Nagaram) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దర్శకుడు దుశ్యంత్ కటికనేని(Dushyanth Katikaneni) తెరకెక్కించారు. ఎమోషనల్ అండ్ రస్టిక్ బ్యాక్డ్రాప్ వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆడియన్స్ నుండి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో కొల్లగొట్టింది ఈ సినిమా. నిజ జీవితం సంఘటనలతో చాలా సహజంగా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు ఆడియన్స్. 

ఇక గత వారం థియేటర్స్ లోకి పెద్ద సినిమాలు రావడంతో అంబాజీపేట మ్యారేజీ బ్యాండు జోరు కాస్త తగ్గింది. అయినప్పటికి బ్రేకీవెన్ సాధించి లాభాలు తెచ్చిపెట్టింది ఈ మూవీ. ఇక థియేటర్స్ అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీ జోరు తగ్గడంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ఆహా దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో మార్చ్ 1నుండి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయాలని చేస్తున్నారట. ఇదే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి థియేటర్స్ లో మంచి విజయం సాదించింది ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.