అంబటి రాంబాబుకు బెయిల్.. రిలీజ్ అవుతారా లేదా..?

అంబటి రాంబాబుకు బెయిల్.. రిలీజ్ అవుతారా లేదా..?

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మంజూరైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇటీవలే అరెస్టైన అంబటికి బెయిల్ మంజూరు చేసింది గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు. అంబటి బెయిల్ పిటిషన్ పై సోమవారం ( ఫిబ్రవరి 9 ) విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసింది కోర్టు.  

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి బెయిల్ మంజూరయ్యింది. ఈ కేసుకి సంబంధించి అంబటిని జనవరి 31న అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం రాజమండ్రి జైలుకు రిమాండ్ ఖైదీగా ఉన్నారు అంబటి రాంబాబు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసింది కోర్టు.

అయితే.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ర్యాలీ కేసులో కూడా అంబటికి రిమాండ్ విధించింది కోర్టు. ఈ కేసులో కూడా బెయిల్ వస్తే అంబటి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో అంబటి రిలీజ్ ఎప్పుడు అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనను శనివారం ( జనవరి 31 ) అరెస్ట్ చేశారు పోలీసులు. ఆదివారం ( ఫిబ్రవరి 1 ) అంబటి రాంబాబును గుంటూరు ప్రత్యేక సివిల్  కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. 

జనవరి 31న వైసీపీ చేపట్టిన పాప ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న అంబటి కర్రలతో, రాళ్లతో వచ్చి కారును అడ్డుకొని దుర్భాషలాడారు టీడీపీ కార్యకర్తలు.. ఈ క్రమంలో సహనం కోల్పోయిన అంబటి టీడీపీ కార్యకర్తలు, సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.