సైరా ట్రైలర్‌పై అమీర్ ఖాన్ రివ్యూ

సైరా ట్రైలర్‌పై అమీర్ ఖాన్ రివ్యూ

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాపై బాలీవుడ్ లోనూ ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలై… సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

#SyeRaaTrailer ను చూసిన ఆమిర్ ఖాన్.   … తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ” సైరా ట్రైలర్ ను ఇప్పుడే చూశా. భారీస్థాయిలో నిర్మించారు. చిరంజీవి గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్. సైరాను చూసేందుకు ఆగలేకపోతున్నాను. చిరంజీవి గారికి, రామ్ చరణ్ కు, టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్.” అని చెప్పాడు ఆమిర్ ఖాన్.

ఈ ఏడాది మొదట్లో క్యోటో ఎయిర్ పోర్టులో ఆమిర్ ఖాన్, చిరంజీవి కలుసుకున్నారు. ఆ సమయంలో.. సైరా గురించి చిరంజీవిని ఆమిర్ ఖాన్ అడిగి తెల్సుకున్నాడు. గతంలో మంగళ్ పాండే పేరుతో చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలో నటించారు ఆమిర్ ఖాన్. అలా… తమ అనుభవాలను ఇద్దరూ షేర్ చేసుకున్నారు. తన ఫేవరెట్ నటుడిని ఇవాళ కలుసుకున్నానంటూ అప్పట్లోనే ఆమిర్ ఖాన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.