కూతురికి కోట్లు విలువ చేసే బంగ్లాను గిఫ్ట్గా ఇచ్చిన అమితాబ్

కూతురికి కోట్లు విలువ చేసే బంగ్లాను గిఫ్ట్గా ఇచ్చిన అమితాబ్

బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) 80 ఏళ్ళ వయస్సులోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అంతేకాదు పాపులర్‌ టీవీ షో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి ’కి హోస్ట్‌గానూ వ్యవహరిస్తున్నాడు. ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్న..ఫ్యామిలీకిచ్చే ఇంపార్టెన్స్ లో కూడా తక్కువేం కాకుండా..హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు బిగ్ బి. 

లేటెస్ట్ గా అమితాబ్ బచ్చన్ తన కూతురైన శ్వేతా బచ్చన్ నందా( Shweta Nanda) కు ఖరీదైన బహుమతిని అందించి, తండ్రి ప్రేమను చాటుకున్నాడు. ముంబైలోని సబ్ అర్బన్ జుహులో ఉన్న రూ.50.63 కోట్ల విలువైన ప్రతీక్ష భవనాన్ని(Prateeksha bungalow) గిఫ్ట్గా ఇచ్చినట్లు సమాచారం.

ఈ బంగ్లా అంటే అమితాబ్ కు చాలా ఇష్టం. చిన్నప్పుడు తన పేరెంట్స్‌తో కలిసి అమితాబ్‌ ఇక్కడే ఉండేవాడు. ఈ విలువైన భవనాన్ని కూతురికి స్టాంప్ డ్యూటీ కింద రాసిచ్చారట అమితాబ్. ఈ ప్రతీక్ష భవనంలో రెండు ప్లాట్స్ ఉండగా..ఒకటి 890.47 చదరపు మీటర్లు కాగా..మరొకటి 674 చదరపు మీటర్లు. ఉందని సమాచారం. అమితాబ్ తన కుమార్తెకు బహుమతిగా నవంబర్ 9 న ఈ బంగ్లాను బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఈ న్యూస్..టాక్ ఆఫ్ ది బాలీవుడ్గా మారింది. అంతేకాదు..ఇదే బంగ్లాలో 2007 లో బిగ్ బి కుమారుడు అభిషేక్ బచ్చన్ మ్యారేజ్ జరిగింది. ప్రస్తుతం అమితాబ్‌ ఫ్యామిలీ జుహులో ఉన్న జల్సా బంగ్లాలో నివసిస్తోంది.