పవన్ మహావీర్ హీరోగా శివాల ప్రభాకర్ దర్శకత్వంలో శైలజా రెడ్డి నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం ‘అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి’. పవన్ మహావీర్ లండన్‌లో డాక్టర్ కోర్సు చేస్తూ హీరోగా నటిస్తున్నాడు. వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్. ఆదిత్య, సి.రాంప్రసాద్, శివనాగు, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అతిథులుగా హాజరై ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉందని టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.
‘డాక్టర్‌గా వైద్యం, యాక్టర్‌గా వినోదం అందించాలనే నా సంకల్పం కార్యరూపం దాల్చడానికి కారకురాలైన మా అమ్మకు ఈ జన్మంతా రుణపడి ఉంటాను’ అని పవన్ మహావీర్ అన్నాడు. ఈ సినిమా విజయం పట్ల చాలా నమ్మకంగా ఉన్నామని దర్శక నిర్మాతలు చెప్పారు.
