పిచ్చిగా ప్రేమించడం.. చావుకంటే నరకం

పిచ్చిగా ప్రేమించడం.. చావుకంటే నరకం

సురేందర్‌ కొంటడ్డి డైరెక్షన్ లో రామ్‌ మిట్టకంటి, అమితా రంగనాథ్‌ హీరో హీరోయన్లుగా నటించిన సినిమా అమృతరామన్. పక్కా లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ సోమవారం రిలీజ్ అయ్యింది. ప్రేమలో పడితే దేనికైనా తెగిస్తామనే రీతిలో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. కాకపోతే ఈ సారి ప్రేమకోసం పరితపించింది, ప్రేమకోసం ఏదైనా చేయడానికి సిద్ధపడింది ప్రేమికుడు కాదు, ప్రేయసి. అదే ఈ సినిమాలోని ప్రత్యేకత.

‘తన ప్రేమని నువ్వు గెలవాలంటే ముందు నువ్వు ఓడిపోవాలి. ప్రేమలో సంతోషాలే కాదు, త్యాగాలు కూడా ఓ భాగమే. రోజురోజుకీ నాకు డ్రగ్‌లా ఎక్కేస్తున్నావ్‌, నేను నీకు అడిక్ట్‌ అవుతున్నాను. ఈ ప్రపంచంలో చావుకంటే నరకం ఏంటో తెలుసా… ఓ మనిషిని పిచ్చిగా ప్రేమించడం’  వంటి డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. ప్రేమించినవాడి కోసం అమ్మాయి పడే వేదనని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎస్‌ఎన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులముందుకు రానున్నట్లు తెలిపింది యూనిట్.