
బాలీవుడ్ బ్యూటీ అమీ జాక్సన్ (Amy Jackson) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఎవడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది ఈ బ్యూటీ. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన 2.O సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్ముడు త్వరలో పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమైంది. ప్రియుడు ఎడ్ వెస్ట్‌విక్ ( Ed Westwick )తో ఎంగేజ్మెంట్ చేసుకుంది అమీ జాక్సన్. ఇదే విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ఈ జంట.
ఇక అమీ జాక్సన్ విషయానికి వస్తే.. ఆమెకు 2019లో జార్జ్ పనయోట్టు (George Panayatiou) అనే బిజినెస్‌మెన్‌తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. పెళ్లి కాకుండానే అతనివల్ల తల్లైంది. కానీ, కొన్ని కారణాల వాళ్ళ పెళ్లి పీటలు కూడా ఎక్కకుండానే 2022లో వీరి బంధానికి ఎండ్ కార్డు పడింది. అప్పటి నుంచి కొడుకు ఆండ్రెస్‌తో ఒంటరిగానే ఉంటోంది అమీ జాక్సన్. ఇప్పుడు మళ్ళీ హాలీవుడ్ నటుడు వెస్ట్‌విక్‌తో ప్రేమలో పడిన ఆమీ... ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో స్విట్జర్లాండ్‌లో అందమైన ప్రదేశంలో అమీజాక్సన్‌కు రింగ్ తొడిగి ప్రొపోజ్ చేశాడు వెస్ట్‌విక్. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.