మహాభారత కథతో ఏఐ సినిమా

మహాభారత కథతో ఏఐ సినిమా

మహాభారతంలోని శక్తివంతమైన అంబ పాత్ర స్ఫూర్తితో వస్తున్న ఏఐ ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిల్మ్‌‌‌‌‌‌‌‌ ‘అంబ’స్‌‌‌‌‌‌‌‌ రివెంజ్’. జయవర్ధన్ మడి తెరకెక్కించారు. నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై యోగేంద్ర పొట్లూరి, రాణి మాడిసన్ నిర్మించారు. బుధవారం ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. భీష్ముని వల్ల ఒక జన్మలో మరణించిన ఆమె మరో జన్మలో పగ తీర్చుకోవడం ఈ చిత్ర ప్రధాన కథాంశం. పురాణ గాథకు అత్యాధునిక ఏఐ సాంకేతికతను జోడించి తెరకెక్కించారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో దర్శకుడు జైవర్ధన్ మేడి మాట్లాడుతూ ‘అంబ పాత్రతో సినిమా అయినప్పటికీ శిఖండి కోణం నుంచి ఈ కథను చూడబోతున్నాం. 

పాత్రలను పరిచయం చేయడానికి టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేశాం. త్వరలో ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేస్తాం’ అని చెప్పాడు. అందరూ సోషల్ మీడియా రీల్స్‌‌‌‌‌‌‌‌లో చూస్తున్నా ఏఐని మించిన విజువల్స్‌‌‌‌‌‌‌‌తో ఈ  సినిమా అద్భుతంగా ఉండబోతోందని నిర్మాత యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి అన్నారు.  సంగీత దర్శకుడు ప్రమోద్ ఎంసి, డైలాగ్స్,  లిరిక్స్ రైటర్ కిషోర్ కుమార్ ఏనుగు,  ఎడిటర్ హ్యారీ బ్రెయిన్, విజువల్ డైరెక్టర్ సాయి నేత క్యారెక్టర్ డిజైనర్ చందు గోసంగి పాల్గొన్నారు.