ఎమోషనల్​గా ఎంగేజ్​ చేసే సలార్

ఎమోషనల్​గా ఎంగేజ్​ చేసే సలార్

‘ఇప్పటివరకు ప్రేక్షకులు తనను చూడనటువంటి పాత్రను ‘సలార్’లో పోషించాను’ అంటున్నాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ రెండు భాగాలుగా రూపొందిస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్  ‘సలార్ సీజ్ ఫైర్’ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్‌‌‌‌‌‌గా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ప్రభాస్ చెప్పిన విశేషాలు.

‘‘ఇదొక యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్. నేను, ప్రశాంత్ నీల్ కలిసి పని చేయాలనుకున్నప్పుడు సినిమా ఎలా ఉంటే అందర్నీ ఆకట్టుకుంటుందనే విషయాలపై బాగా చర్చించాం. నా మైండ్‌‌‌‌లో ఉన్న ఆలోచనలను ఆయన ముందు పెట్టా.  మేం అనుకున్న కథకు బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా ఉండాలనే విషయాన్ని చర్చించాం. ప్రశాంత్‌‌‌‌తో  ఎప్పుడు షూటింగ్ చేస్తానా అని ఆసక్తిగా ఎదురు చూశా.  నా 21 ఏళ్ల సినీ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఎప్పుడూ ఇలా భావించలేదు. షూటింగ్ మొదలైన నెల రోజుల్లోనే ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. ప్రశాంత్ హీరోలను గొప్పగా చూపించే దర్శకుడు. సినిమా షూటింగ్ సమయాన్ని తను రిలాక్స్‌‌‌‌డ్‌‌‌‌గా నా సమయానికి తగ్గట్లు చేసుకుంటూ వచ్చాడు.   నాతో పాటు శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ ఇలా అందరం సెట్స్‌‌‌‌లో కలిశామంటే చాలా సరదాగా గడిచిపోయేది. మా ఎంజాయ్‌‌‌‌మెంట్‌‌‌‌కి అడ్డే ఉండేది కాదు. నేను ఎప్పుడూ షాట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఏర్పడలేదు.  ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు నేను ఎప్పుడు సెట్స్‌‌‌‌లోకి అడుగు పెట్టానో సమయం గుర్తు లేదు. అయితే నేను ఎంటర్ అవగానే అంతా ఆపేసి హీరో సన్నివేశాలను చిత్రీకరించటానికి టీమ్ సిద్ధమైంది. తను అంతలా నన్ను కేరింగ్‌‌‌‌గా చూసుకున్నారు. అలాగే పాత్రల మధ్య ఎమోషన్స్‌ ను ఎంగేజింగ్‌గా చూపించారు.  ఇందులోని దేవా పాత్ర  కోసం నేనేం ప్రత్యేకంగా కష్టపడలేదు. క్యారెక్టర్ కోసం కండలు పెంచాలని ప్రశాంత్ ముందే చెప్పారు. ఆయన చెప్పినట్లే నేను మారాను. అది నాకు సాధారణమైన విషయం మాత్రమే. సినిమాలోని రెండు ప్రధాన పాత్రల మధ్య చక్కటి సోదర భావాన్ని ప్రేక్షకులు చూస్తారు’’.