అనగనగా ఒక రాజు సక్సెస్ సెలబ్రేషన్స్

అనగనగా ఒక రాజు సక్సెస్ సెలబ్రేషన్స్

ఈ సంక్రాంతికి వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం మరో ఏడు తరాల పాటు గుర్తుండిపోతుంది అని  నవీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొలిశెట్టి అన్నాడు. నవీన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రం జనవరి 14న విడుదలై నవీన్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే బిగ్గెస్ట్ హిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచింది.  రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, మంచి విజయాన్ని అందుకుందని చెప్పిన టీమ్ శుక్రవారం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన దర్శకుడు బాబీ, నిర్మాత దిల్ రాజు చిత్ర యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందించారు. చిత్ర దర్శకుడు మారి, నిర్మాత సూర్యదేవరనాగవంశీ సహా మూవీ టీమ్ అంతా ఈ షీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందుకున్నారు.