‘8 వసంతాలు’ సినిమా హీరోయిన్ అనంతిక చెప్పిన విశేషాలు

‘8 వసంతాలు’ సినిమా హీరోయిన్ అనంతిక చెప్పిన విశేషాలు

‘మ్యాడ్’ చిత్రంతో గ్లామర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అనంతిక సనీల్ కుమార్ ఫిమేల్ లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటించిన సినిమా ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. జూన్ 20న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనంతిక చెప్పిన విశేషాలు.

‘‘ఇది మహిళలకు  సంబంధించిన ఎమోషనల్ కథ.  ఇందులో  నేను కోరుకున్న ప్రతిదీ ఉంది. యాక్షన్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేయాలని ఉండేది. అవన్నీ కూడా ఈ కథలోనే కుదిరాయి. పర్ఫార్మెన్స్  చేయడానికి  మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్. నేను శుద్ధి యోగ్య అనే రచయిత పాత్రలో కనిపిస్తా.  అలాగే మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం కూడా ఉంటుంది. ఈ సినిమా కోసం కళరి ఫైట్ నేర్చుకున్నా. దీంతో పాటు వింగ్ చున్ అనే చైనీస్ ఆర్ట్ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కూడా నేర్చుకున్నా. ఇది నాకు  వెరీ మొమరబుల్ క్యారెక్టర్. నాతో పాటు ప్రతి పాత్రలోనూ లేయర్స్ ఉంటాయి.

హను రెడ్డి వెరీ గుడ్ యాక్టర్. చాలా ఫాస్ట్‌‌గా నేర్చుకుంటారు. రవి కూడా చాలా మంచి నటుడు. ఎంత పెద్ద డైలాగ్ అయినా సులువుగా చెప్పగలరు.  డైరెక్టర్  ఫణీంద్ర ప్యాషనేట్ ఫిలిం మేకర్.  ఈ జర్నీలో ఆయన దగ్గర నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నా. మైత్రీ మూవీ మేకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వర్క్ చేయడం వండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియెన్స్.  ప్యూర్ లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోరీగా.. నిజమైన జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. అన్ని ఏజ్ గ్రూప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి రిలేట్ అవుతుంది’’.