Ananthika Video: మ్యాడ్ హీరోయిన్‏ టాలెంట్కి ఫిదా.. తనలో ఇన్ని కళలున్నాయా? నోరెళ్లబెట్టాల్సిందే!

Ananthika Video: మ్యాడ్ హీరోయిన్‏ టాలెంట్కి ఫిదా.. తనలో ఇన్ని కళలున్నాయా? నోరెళ్లబెట్టాల్సిందే!

'మ్యాడ్' మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకున్నహీరోయిన్ అనంతిక సనిల్ కుమార్. కేరళకి చెందిన ఈ టీనేజీ అమ్మాయి ఆ సినిమాలో క్యూట్గా కనిపిస్తూ చక్కటి నటనతో ఆకట్టుకుంది. అందులో ఆమెను చూసి యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి '8 వసంతాలు' సినిమాలో అవకాశమిచ్చాడు.

డ్రామా అండ్ రొమాంటిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో అనంతిక ప్రధాన పాత్ర పోషిస్తుంది. అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ 'మైత్రి మూవీ మేకర్స్' ఈ చిత్రాన్ని నిర్మించింది. హీరోయిన్ ఓరి యెంటెడ్ గా వస్తున్న ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

లేటెస్ట్గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. అనంతిక మల్టీ టాలెంట్ చూసి అందరూ ఫిదా అయ్యారు. ఈ అమ్మాయిలో ఇన్ని కళలున్నాయా అంటూ నోరెళ్లబెట్టి చూశారు. నటిగానే కాకుండానే క్లాసికల్ డ్యాన్స్తో పాటు 'సాగర సంగమం'లోని ఓ పాటకు ఆమె అద్భుతంగా అభినయించింది. దీనికితోడు అనంతిక మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం మరో ఎత్తు. స్టేజ్ మీద తన ప్రతిభమరింత ఎలివేట్ అయింది. కేవలం 19 ఏండ్ల వయసులోనే ఇంత పరిణితిని కనబరుస్తోన్న అనంతికపై ప్రశంసలు కురుస్తున్నాయి.

అనంతిక కేవలం నటిగానే కాదు, దాదాపు 13 కళలలో ఆమెకు టాలెంట్ ఉన్నట్లు టాక్. కరాటేలో ఆమెకు బ్లాక్ బెల్ట్ ఉంది. కేరళకు చెందిన కళరిపయట్టు అనే మార్షల్ ఆర్ట్ సైతం నేర్చుకుంది. కత్తి ఫైటింగ్ లోనూ ఆమె సిద్ధహస్తురాలే.. ఇవే కాకుండా కేరళ సంప్రదాయంలోని చెండా (డ్రమ్స్) సైతం వాయిస్తుంది. ప్రస్తుతం లాయర్ కోర్సు చేస్తుంది. అలాగే చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది.

ఇటీవలే రిలీజైన ట్రైలర్ ఆలోచింపజేస్తోంది. ఇందులో వచ్చే డైలాగ్స్.. ఒక్కోటి ఒక్కో అద్భుతం అనేలా ఉన్నాయి. 'చూడమ్మా ఆడవాళ్లు నిప్పు పట్టకూడదు.. కర్మకాండలు, అంత్యక్రియలకు వాళ్లు పనికిరారు'.. 'పనికిరరా.. పేగు పంచి ప్రాణం పోయగలిగిన వాళ్ళం.. చితి ముట్టించి మోక్షం ఇప్పించలేమా?

‘మగాడి ప్రేమకు సాక్ష్యాలుగా పాలరాతి సౌధాలు, భాగ్యనగరాలు ఉన్నాయి. ఆడదాన్ని ప్రేమకు ఏమున్నాయ్.. మనసులో పాతిపెట్టిన జ్ఞాపకాలు తప్ప..’అనే ఈ డైలాగ్స్ తోనే సినిమా ఎలా ఉండబోతుందనేది తెలిసిపోయింది.

అలాగే, ‘అమ్మాయిలకి కత్తి పట్టుకుని రౌద్ర రసం చూపేవాడు కంటే.. కన్నీళ్లు తుడుస్తూ కరుణ రసం చూపించేవాడు అంటేనే ఇష్టం’అనే డైలాగ్ యూనివర్సల్‌‌‌‌‌‌‌‌గా కనెక్ట్ అవుతోంది. ‘ప్రేమ చేరుకోవడానికి ఒక గమ్యం కాదు, మనం చేయాల్సిన ప్రయాణం’అనే హార్ట్ టచ్చింగ్ డైలాగ్ సినిమాలోని ఎమోషనల్ డెప్త్‌‌‌‌‌‌‌‌ని తెలియజేస్తోన్నాయి. 

►ALSO READ | PEDDI: ‘పెద్ది’ తో రామ్ చరణ్ హైరిస్క్.. ఇండియాలో ఎవ్వరూ టచ్ చేయని ట్రైన్ సీక్వెన్స్!

మధురం షార్ట్ ఫిల్మ్‌తో ఎంతోమంది ప్రేమికులకు దగ్గరైన ఫణీంద్ర నర్సెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో తనలోని మరోకొత్త కోణాన్ని పరిచయం చేయనున్నాడు ఫణీంద్ర.