అనన్య నాగళ్ల లీడ్ రోల్‌లో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘లీసా’. జవహర్ పవార్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.
ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘‘కూర్గ్, విరాజ్‌పేట, పెంచలకోన పరిసర ప్రాంతాల్లోని అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ చేశాం. చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
రెండు భిన్నమైన జానర్స్‌ను మిక్స్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు రాని ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా సర్‌ప్రైజ్ చేయబోతోంది. అనన్య నాగళ్ల నటన, మణిశర్మ సంగీతం హైలైట్‌గా నిలుస్తాయి. నవంబర్‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’’ అని చెప్పారు.
