మళ్లీ మళ్లీ ప్రేమలో పడేలా చేసావ్..ధన్యవాదాలు! కేటీఆర్‌ను మెచ్చుకుంటూ అనసూయ ట్వీట్

మళ్లీ మళ్లీ ప్రేమలో పడేలా చేసావ్..ధన్యవాదాలు! కేటీఆర్‌ను మెచ్చుకుంటూ అనసూయ ట్వీట్

యాంకర్ అనసూయ (Anasuya) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓపక్క సినిమాలు చేస్తూనే, మరోపక్క యాంకర్ గా కూడా కొనసాగుతున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు అను. ఎప్పటికప్పుడు తన సినిమాలు, ఫ్యామిలీకి సంబందించిన విషయాలను అభిమానులతో పంచుకంటూ ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో కాంట్రావర్సిలకు కూడా ఛాన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే తనపై వచ్చే ట్రోలింగ్స్ కూడా సాలిడ్ కౌంటర్లు ఇస్తూ ఉంటారు అనసూయ.

ఇక అసలు విషయానికి వస్తే..అనసూయకు ఫస్ట్ నుంచి కేసీఆర్, కేటీఆర్ అంటే ప్రత్యేకమైన గౌరవం ఉందని చాలాసార్లు తన ట్వీట్స్ లో తెలిపింది.అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూలలో కూడా బహిరంగంగా చెప్పుకొచ్చింది. ఇక నేడు తెలంగాణ ఎలక్షన్స్ లో  బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన విషయం తెల్సిందే. ఆ ఓటమిని కేటీఆర్ సైతం అంగీకరిస్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతుండగా..అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

లేటెస్ట్ గా ఇదే విషయంపై అనసూయ సైతం..KTR ట్వీట్ పై స్పందించింది.” మీరు నిజమైన నాయకుడు సార్.. ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు..మన రాష్ట్ర స్థితిని అవతలి వైపు నుంచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉండవచ్చు..బలమైన ప్రతిపక్షంగా ఉండి కూడా మీరు చేయాల్సింది తప్పక చేస్తారని ఆశిస్తూన్నాను..అంతేకాకుండా హైదరాబాద్ సిటీతో మళ్లీ మళ్లీ ప్రేమలో పడేటట్లు చేసినందుకు చాలా ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే గెలిచిన కాంగ్రెస్ పార్టీకి అనసూయ అభినందనలు తెలిపారు.