గెలిస్తే గట్టి హగ్ ఇస్తా.. ప్రశాంత్కు బంపర్ ఆఫర్ ఇచ్చిన శ్రీముఖి

గెలిస్తే గట్టి హగ్ ఇస్తా.. ప్రశాంత్కు బంపర్ ఆఫర్ ఇచ్చిన శ్రీముఖి

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) గ్రాండ్ ఫినాలే కు కేవలం ఒకరోజు మాత్రమే మిగిలి ఉంది. శుక్రవారంతో ఓటింగ్ లోన్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. ఇక స్టేజిపై విన్నర్ ను అనౌన్స్ చేయడం మాత్రమే మిగిలింది. దీంతో ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సీజన్ ఎవరుకానున్నారు అని. ఇక విన్నింగ్ రేస్ లో ముగ్గురు కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీ నడిచింది. అందులో పల్లవి ప్రశాంత్,శివాజీ,అమర్ దీప్ ఉన్నారు. ఇక ఈ ముగ్గరిలో ఎవరు విన్నర్ కానున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

ఇదిలా ఉంటే.. సీజన్ 7 చివరి దశకు చేరుకోవడంతో కంటెస్టెంట్స్ తో ఫన్నీ గేమ్స్ ఆడిపిస్తున్నాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా తాజాగా శనివారం నాటి ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు టీమ్. ఈ ఎపిసోడ్ లో భాగంగా ప్రముఖ యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలో మా టీవిలో ఒక పాటల ప్రోగ్రామ్‌ మొదలుకాబోతోందని.. అందుకోసం బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఆడిషన్‌ చేసింది.

ఇందులో భాగంగా పల్లవి ప్రశాంత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది శ్రీముఖి. ప్రశాంత్‌..  ప్లీజ్ ఇది ఫన్‌ టాస్క్‌ మాత్రమే.. ఓడిపోతే హగ్‌ ఇస్తా.. గెలిస్తే గట్టి హగ్‌ ఇస్తా.. కానీ ఏడవకు అంటూ చెప్పుకొచ్చింది. దానికి ప్రశాంత్ కూడా సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోయాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.