ఆంధ్రా అభిమాని కేసీఆర్ కు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్

ఆంధ్రా అభిమాని కేసీఆర్ కు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్

ఈస్ట్ గోదావరి : సీఎం కేసీఆర్ కు, కేటీఆర్ కు ఆంధ్రాలోనూ ఫ్యాన్స్ ఉంటారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ ఆంధ్రా అభిమాని సీఎం కేసీఆర్ కు వెరైటీ గిఫ్ట్ ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా,   కడియంలో పల్లా వెంకన్న నర్సరీలో.. పల్లా సుబ్రహ్మణ్యం అనే అభిమాని పూలు, మొక్కలతో కేసీఆర్‌ ముఖ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.

రంగురంగుల పూలు, పూలమొక్కలతో కేసీఆర్ ముఖ చిత్రాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్ది జన్మదిన శుభాకంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమంతో ప్రేరణ పొంది.. తాము ఈ విధంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపామని తెలిపారు. కేసీఆర్ చిత్రపటాన్ని వేసిన వారిలో తూర్పు గోదావరి జిల్లా వాసులు పల్ల సత్తిబాబు, పల్ల సుబ్రహ్మణ్యం, పల్ల గణపతి ఉన్నారు.