రియల్ మీ ఫోన్లలో ఆండ్రాయిడ్ 13

రియల్ మీ ఫోన్లలో ఆండ్రాయిడ్ 13

ఆగస్ట్ లో విడుదలైన ఆండ్రాయిడ్ 13 వెర్షన్ విడతల వారిగా కొన్ని ఫోన్లలో రిలీజ్ చేసుకుంటూ వచ్చింది. అయితే తాజాగా ఇప్పుడు ఈ అప్ డేట్ రియల్మీ ఫోన్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదట రియల్మీ జీటీ నియో 3టీ, రియల్మీ నార్జో 50 ప్రో ఫోన్లకు ఈ అప్ డేట్ వస్తుంది. మిగతా ఫోన్లకు త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. ఈ అప్ డేట్ కొన్ని ఫోన్లలో ఆటోమెటిక్ గా వస్తే, మరికొన్ని ఫోన్లలో సెట్టింగ్స్ లోకి వెళ్లి అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ ఆక్వామార్షిక్ డిజైన్ థీమ్ లో ఉంటుంది. హోమ్ స్క్రీన్ పై క్లాక్, విడ్జెస్, సైడ్ బార్ టూల్ బాక్స్, మీడియా ప్లే బ్యాక్ కంట్రోల్, యూఐ యానిమేషన్, బ్యాటరీ లైఫ్, కొత్త సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. ఆండ్రాయిడ్ 13 వల్ల యూజర్ ఎక్స్ పీరియన్స్ ఫాస్ట్ గా ఉండనుంది.