సరికొత్త లుక్లో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్.. వీడియో రిలీజ్ చేసిన మేకర్స్

సరికొత్త లుక్లో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్.. వీడియో రిలీజ్ చేసిన మేకర్స్

ఫ్యామిలీ..లవ్..యాక్షన్..ఇలా ఏ జోనర్లో అయిన సినిమాలు చేస్తూ..అభిమానుల్లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో రాజశేఖర్(Rajasekhar). టాలీవుడ్ టాప్ హీరోస్లో ఒకరైన రాజశేఖర్..కెరీర్ స్టార్టింగ్లో ఎక్కువగా ఆవేశంతో కూడిన క్యారెక్టర్లో నటిస్తూ..యాంగ్రీ మ్యాన్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. 

రాజశేఖర్ సోలో హీరోగా సినిమాలు చేస్తూ..విలన్ రోల్స్ లో, మిగతా ముఖ్యమైన రోల్స్లో గానీ తనకు నటించడం ఇష్టం లేదంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. లేటెస్ట్గా ఆ కంచెను ఇప్పుడు దాటేసినట్లు సమాచారం. చాలా కాలం నుంచి సరైన హిట్ ఒకటి పడకపోవడంతో..రాజశేఖర్ బిగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

రైటర్, డైరెక్టర్ వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న ఎక్స్‌ట్రా-- ఆర్డనరీ మేన్(Extra- Ordinary Man) మూవీలో..ఒక పవర్ ఫుల్ రోల్ లో రాజశేఖర్ నటిస్తున్నట్లు మేకర్స్ వీడియో రిలీజ్ చేశారు. రాజశేఖర్ సరికొత్త లుక్తో క్యారవాన్ నుంచి దిగి నడిచోస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. మోస్ట్ సెలబ్రేట్ యాంగ్రీ మ్యాన్ ఆఫ్ తెలుగు సినిమా..అండ్ వర్సటైల్ యాక్టింగ్కు ప్రతిరూపం..ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సెట్స్‌పైకి అడుగు పెట్టారు. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటన మిమ్మల్ని గూస్బంప్స్ చేసేలా చేస్తుంది అంటూ పోస్ట్ చేసింది ప్రొడక్షన్ హౌస్ శ్రేష్ట్ మూవీస్. 

నితిన్(Nithiin) హీరోగా వస్తోన్న ఎక్స్‌ట్రా మూవీలో..రాజశేఖర్ క్యారెక్టర్ లో విభిన్నమైన షెడ్స్ ఉండేలా ప్లాన్ చేశాడట డైరెక్టర్. అందుకే రాజశేఖర్ ఎక్స్‌ట్రా సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు సోలో హీరోగా నటిస్తూ వస్తోన్న రాజశేఖర్.. గరుడవేగ, శేఖర్, కల్కి మూవీస్తో యావరేజ్ హిట్ అందుకున్నారు. 

ఇప్పటి నుంచి రాజ శేఖర్ తన సెకండ్  ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ నుంచి హీరో రాజేంద్ర ప్రసాద్, యాక్షన్ కింగ్ అర్జున్, సుమన్, జగపతిబాబు లాంటి ఎంతో మంది స్టార్ హీరోస్ తమదైన క్యారెక్టర్ రోల్స్ తో ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. దీంతో రాజశేఖర్ కూడా తనదైన యాక్టింగ్ తో సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ గా ఉండాలని..ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇక  నితిన్ ఎక్స్‌ట్రా మూవీ నుంచి రిలీజైన సాంగ్స్, పోస్ట్సర్స్ ఆడియన్స్ ను వీపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ  మూవీని నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖితా రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేస్తున్నారు. శ్రీలీల ఫస్ట్ టైం నితిన్ కు జోడీగా నటిస్తుండగా.. 2023 డిసెంబర్ 8న ఈ మూవీ  గ్రాండ్ గా రిలీజ్ కానుంది.