మనసు మార్చుకున్న అనిల్.. ఒకే కథని ఇద్దరికి!

మనసు మార్చుకున్న అనిల్..  ఒకే కథని ఇద్దరికి!

అనిల్ రావిపూడి(Anil Ravipudi).. టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ సినిమాలకు కేరాఫ్ గా మారిపోయాడు ఈ దర్శకుడు. రాజమౌళి తరువాత ఇప్పటివరకు ఒక్క ప్లాప్ లేని దర్శకుడు అంటే అనిల్ రావిపూడి అనే చెప్పాలి. ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇటీవలే నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అనిల్. అప్పటి నుండి ఈ దర్శకుడి నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఈ నేపధ్యంలోనే అనిల్ తన తరువాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నారు అనే వార్తలు వినిపించాయి.

ఈ ప్రాజెక్టు కు సంబందించిన కథా చర్చలు కూడా జరిగాయని, చిరు కూడా ఒకే చెప్పేశాడననే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే అనూహ్యంగా దర్శకుడు వశిష్టతో విశ్వంభర మొదలుపెట్టేశాడు చిరంజీవి. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమా కోసం చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబో క్యాన్సిల్ అయిందట. దీంతో అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా కోసం విక్టరీ వెంకటేష్ ను సెలెక్ట్ చేసుకున్నాడట. ఇప్పటికే ఈ కాంబోలో F2, F3 సినిమాలు వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. 

అందుకే ఈ కాంబోలో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక చిరు క్యాన్సిల్ చేసిన కథనే వెంకటేష్ కు చెప్పి ఒప్పించాడట అనిల్. మరి ఆ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు టేకప్ చెయ్యనున్నాడట. దిల్ రాజు, అనిల్ రావిపూడి, వెంకటేష్, ఈ కాంబోకి జనాల్లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు మరో సినిమా కోసం ఈ ముగ్గురు జత కడుతుండటంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.