VenkyAnil5: వెంకీ-కళ్యాణ్ రామ్ మూవీ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్లుగా కీర్తి, కృతి శెట్టి ఫిక్స్.. సినిమా టైటిల్ ఇదే!

VenkyAnil5: వెంకీ-కళ్యాణ్ రామ్ మూవీ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్లుగా కీర్తి, కృతి శెట్టి ఫిక్స్.. సినిమా టైటిల్ ఇదే!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ, ఇవాళ (జూన్ 18, 2026న) ఘనంగా పూజా కార్యక్రమం జరుపుకుంది. ఈ వేడుకకు చిత్ర యూనిట్‌తో పాటు ముఖ్య అతిధులుగా రాఘవేంద్ర రావు, అల్లు అరవింద్, దిల్‌రాజు, శిరీష్ రెడ్డి తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్కు జోడిగా కృతి శెట్టి హీరోయిన్స్గా నటిస్తున్నట్లు ఖరారైంది. జూన్ 22 నుంచి రెగ్యులర్ షూట్ షురూ కానుంది. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ కంప్లీట్ చేసి, వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపడమే టార్గెట్గా అనిల్ పెట్టికున్నారు. ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

టైటిల్ ఇదేనా?

వెంకీ-అనిల్ కాంబోలో వస్తోన్న 5వ సినిమా ఇది. ఇక అనిల్ రావిపూడికి ‘పటాస్’ లాంటి డెబ్యూ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన కల్యాణ్ రామ్‌తో ఇది రెండో సినిమా కావడం విశేషం. వరుస ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్తో వస్తున్న అనిల్ రావిపూడి.. ఈ సినిమాతో మరో గ్రాండ్ సక్సెస్ అందుకోనున్నారని సినీ వర్గాల టాక్. ముఖ్యంగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ షికారు చేస్తోంది.

సంక్రాంతి సెంటిమెంట్‌ను నమ్ముకునే అనిల్.. ఈ చిత్రానికి ఏకంగా ‘జనవరి 13 విడుదల’ అనే వెరైటీ టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. టైటిల్ వింటేనే అనిల్ మార్క్ కామెడీ అండ్ కమర్షియల్ వైబ్స్ క్లియర్‌గా అర్థమవుతున్నాయి.

వెంకీ కామెడీ టైమింగ్, కల్యాణ్ రామ్ యాక్షన్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్.. వెరసి వచ్చే 2027 సంక్రాంతికి థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అనేలా సినిమా రూపుదిద్దుకోనుంది. ఇక వరసగా అనిల్ స్టైల్ ప్రమోషన్స్ రానున్నాయి.