సౌండ్ పార్టీ .. నాన్‌‌‌‌స్టాప్ నవ్వులు

సౌండ్ పార్టీ ..  నాన్‌‌‌‌స్టాప్ నవ్వులు

వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా సంజయ్ శేరి దర్శకత్వంలో  రూపొందిన చిత్రం  ‘సౌండ్ పార్టీ’. దర్శకుడు జయశంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర నిర్మించారు.  సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ నిర్వహించారు. గెస్ట్‌‌‌‌గా హాజరైన అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘ఈ మధ్యకాలంలో ఇంత  హిలేరియస్ గా చూసిన ట్రైలర్ ఇదే. సినిమా సక్సెస్ సాధించి కెరీర్‌‌‌‌‌‌‌‌లో సన్నీ  మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నా’ అన్నారు.  

దర్శకులు వి.యన్. ఆదిత్య, కేఎల్ దామోదర్ ప్రసాద్, హీరో చైతన్య రావు టీమ్‌‌‌‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. అందరూ హాయిగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందన్నాడు సన్నీ. ఇందులో ఎలాంటి వల్గారిటీ,  డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు అని చెప్పారు శివన్నారాయణ. 

రెండు గంటల పాటు నాన్ స్టాప్‌‌‌‌గా నవ్వించే సినిమా ఇది అన్నాడు సంజయ్. నిర్మాతలు మాట్లాడుతూ ‘అవుట్ అండ్ అవుట్ కామెడీతో అన్ని వయసుల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది’ అని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్, లిరిసిస్ట్ పూర్ణాచారి సహా మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.