Tripti Dimri: అక్కడ ఇంతలా ఫేమ్ వస్తోందని ఊహించలే..త్రిప్తి కామెంట్స్ వైరల్

Tripti Dimri: అక్కడ ఇంతలా ఫేమ్ వస్తోందని ఊహించలే..త్రిప్తి కామెంట్స్ వైరల్

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర యానిమల్(Animal) ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. అంతే మాదిరిగా ఇందులో సెకండ్ హీరోయిన్గా నటించిన త్రిప్తి డిమ్రి (Tripti Dimri)  హవా కూడా కొనసాగుతోంది. యానిమల్లో కనిపించింది చిన్న పాత్రలో అయినా తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో,రొమాంటిక్ సీన్స్తో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

లేటెస్ట్గా ఈ సినిమా సక్సెస్లో భాగంగా మాట్లాడుతూ..ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'ఈ సినిమాలో నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉండటంతో..నిడివి తక్కువ ఉన్న నటించాను.సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని ముందే తెలుసు..కానీ,నా పాత్రకు ఇంత పెద్ద పేరు రావడం నా అదృష్టం అని తెలిపింది.అంతేగానీ, ఫేమస్ అవుతానని సినిమా చేయాలే.అలాగే  సోషల్ మీడియాలో నాపై వస్తోన్న కాంప్లిమెంట్స్ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ యానిమల్ సక్సెస్ని ఎంజాయ్ చేయడం చాలా థ్రిల్లింగ్గా ఉందంటూ త్రిప్తి వెల్లడించింది.

ఇదిలా ఉంటే..ఆమెకు యానిమల్ సినిమా రిలీజ్కు ముందు..అంటే నవంబర్‌ చివరి వారంలో 6లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా..ప్రస్తుతం ఆ సంఖ్య 40 లక్షలకు చేరింది. ఇప్పటికే మీకు అర్ధం అయ్యి ఉంటది..ఈ లెక్క రోజురోజుకూ అమాంతం పెరుగుతూ వెళ్తోందని. 

ఇక త్రిప్తి 2021లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుంది. అంతేకాకుండా..రెడిఫ్ డాట్ కామ్ (Rediff.com) 2020 బాలీవుడ్ ఉత్తమ నటీమణుల జాబితాలో ఆమె 8వ స్థానంలో నిలిచింది.ఇక ఎంతో ఫేమస్ అయిన టైమ్స్ ఆఫ్ ఇండియా 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్ ఆఫ్ 2020లో త్రిప్తి 20వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం తెలుగులో రవితేజ సరసన నటించే అవకాశం అందుకున్నట్టు సమాచారం.