బంపర్ ఆఫర్ కొట్టేసిన యానిమల్ బ్యూటీ.. రవితేజ సినిమా కోసమేనా?

బంపర్ ఆఫర్ కొట్టేసిన యానిమల్ బ్యూటీ.. రవితేజ సినిమా కోసమేనా?

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర యానిమల్(Animal) ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఈ సినిమా. టాలీవుడ్ మోస్ట్ వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన నాలుగురోజుల్లోనే  రూ.450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

ఇదిలా ఉంటే.. యానిమల్ సినిమా విడుదలైనప్పటి నుండి ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించిన త్రిప్తి దిమ్రి వైరల్ అవుతోంది. సినిమాలో కనిపించింది చిన్న పాత్రలో అయినా తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ బ్యూటీ. తన పాత్రకు సంబందించిన క్లిప్స్ ను సోషల్ మీడియాలో తెగ షేర్ చేసుకుంటున్నారు కుర్రాళ్ళు. దీంతో ఈ భామకు వరుస ఆఫర్స్ వస్తున్నాయట. 

తాజా సమాచారం ప్రకారం త్రిప్తి దిమ్రి టాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిందట. మాస్ మహారాజ రవితేజ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ గా మొదలుకానుంది. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రిని తీసుకున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఒక్క హిట్టుతో ఆ భామ ఫేట్ మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.