అమ్మాయిని కాపాడిన యానిమల్ యాక్టర్.. ఇతను రియల్ హీరో

అమ్మాయిని కాపాడిన యానిమల్ యాక్టర్.. ఇతను రియల్ హీరో

యానిమల్(Animal) సినిమాలో అర్జన్ వ్యాలీ సాంగ్ లో కనిపించిన నటుడు గుర్తున్నాడా. ఆపాటలో ఆవేశంగా నటించి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. కనిపించేది కొచం సేపైనా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాడు ఈ నటుడు. అతని పేరు మన్​జోత్ సింగ్​(Manjoth singh). తాజాగా ఈ నటుడికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ అతనిపై రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. రియల్ హీరో అనేంతలా అతను ఏం చేశాడు అనుకుంటున్నారా?

అసలు విషయం ఏంటంటే.. మన్​జోత్ సింగ్​ కాలేజ్ లో చదువుకుంటున్న సమయంలో ఆ కాలేజ్ బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది ఒక అమ్మాయి. ఆ సమయంలో పక్కనే ఉన్న మన్​జోత్ సింగ్​ పరిగెత్తుకుంటూ వెళ్లి దూకబోతున్న అమ్మాయి చేయి పట్టుకున్నాడు. అలా కొంతమంది సహాయంతో ఆ అమ్మాయిని కాపాడాడు మన్​జోత్ సింగ్​. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్స్ మన్​జోత్ సింగ్​ రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలా యానిమల్ సినిమాలో సైడ్ క్యారెక్టర్ లో కనిపించిన ఈ నటుడు ఇప్పుడు రియల్ హీరోగా మారిపోయాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. వైరల్ అవుతున్న వీడియో ఇప్పటిదికాదు.. మన్​జోత్ సింగ్ గ్రేటర్ నోయిడాలో శారదా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్​ చదువుతున్న సమయంలోది.