Animal Movie: షారుఖ్ పఠాన్ను బీట్ చేసిన యానిమల్ మూవీ

Animal Movie:  షారుఖ్ పఠాన్ను బీట్ చేసిన యానిమల్ మూవీ

డైరెక్టర్ సందీప్ వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన యానిమల్ (Animal) సినిమా..రికార్డ్ కలెక్షన్స్తో బాక్సాపీస్ దుమ్మురేపింది. సినిమా రిలీజై 5 వారాలు కంప్లీట్ చేసుకుని..అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా యానిమల్ మూవీ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పఠాన్ (Pathaan)ను అధిగమించి సత్తా చాటింది. దీంతో యానిమల్ 2023లో రెండవ అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది.

పఠాన్ మూవీ థియేట్రికల్ రిలీజ్ ముగిసే టైంకి..మొత్తం ఇండియా వైడ్ గా దాదాపు రూ.543.05 కోట్లు సాధించింది. లేటెస్ట్ యానిమల్ కేవలం 31 రోజులలో ఇండియా వైడ్గా రూ.544.93 కోట్లు వసూలు చేసింది. దీంతో యానిమల్ మూవీ షారుఖ్ పఠాన్ను బీట్ చేసిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. 

అంతేకాకుండా షారుఖ్ జవాన్ మూవీ తర్వాత (అన్ని భాషల్లో కలిపి) బాలీవుడ్‌ లో రెండో అతిపెద్ద చిత్రంగా యానిమల్ నిలిచింది. యానిమల్ మూవీ ఆల్ ఇండియా గ్రాస్ సుమారుగా 650 కోట్లు కాగా..ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రాస్ విలువ 890 కోట్లు సాధించింది. 

యానిమల్ సినిమాకు A సర్టిఫికేట్ రావడం..రన్‌టైమ్ ఎక్కువ అవ్వడం..విపరీతమైన వయోలెన్స్ కాస్తా మైనస్ అయ్యాయని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. ఇటువంటి సీన్స్ ఉండటం వల్లే బాక్సాపీస్ రికార్డ్ కొల్లగొట్టిందని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. 

డిసెంబర్ 1న రిలీజైన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించగా..బాబీ డియోల్,అనిల్ కపూర్,త్రిప్తి డిమ్రీ కీలక పాత్రలు పోషించారు.