యానిమల్ దెబ్బకు షారుఖ్ రికార్డ్స్ ఔట్.. ఆ కలెక్షన్స్ ఏంది సామీ!

యానిమల్ దెబ్బకు షారుఖ్ రికార్డ్స్ ఔట్.. ఆ కలెక్షన్స్ ఏంది సామీ!

యానిమల్(Animal) సినిమా బాక్సాఫీస్ దగ్గర కలక్షన్స్ సునామి సృష్టిస్తోంది. విడుదలై మూడురోజులు గడుస్తున్నా ఈ సినిమా జోరు మాత్రం అస్సలు  తగ్గడంలేదు. రోజురోజుకి పెరుగుతున్న ఆదరణతో రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది ఈ మూవీ. మొదటిరోజు ఏకంగా రూ.116 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా.. రణ్బీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రెండో రోజుల్లోనే రూ.236 కోట్లు కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలని సైతం ఆశ్చర్యపరిశింది. ఇక నిన్న(ఆదివారం డిసెంబర్ 3) కూడా అదే రేంజ్ లో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టి.. బాలీవుడ్ బాడ్ షా షారుఖ్ ఖాన్ రికార్డ్స్ ను సైతం బద్దలుకొట్టేసింది. 

షారుఖ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ పఠాన్ హిందీ వర్షన్‌ కేవలం 3 రోజుల్లో రూ.161 కోట్ల వసూళ్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇపుడా రికార్డ్ ను బ్రేక్ చేసింది యానిమల్ మూవీ. యానిమల్ మూవీ హిందీ వర్షన్ కూడా కేవలం మూడు రోజుల్లో రూ.161 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో షారుఖ్ పఠాన్ సినిమా రికార్డ్స్ ను బ్రేక్ చేసేసింది యానిమల్ మూవీ. దీంతో రణ్బీర్ కపూర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఇక యానిమల్ సినిమాకు మేకర్స్ దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ పెట్టారు కానీ.. కేవలం మూడు రోజుల్లోనే రూ.356 కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది యానిమల్ మూవీ. ఇక డిసెంబర్ 7 వరకు కొత్త సినిమాలు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ వారం రోజుల్లో నెక్స్ట్ లెవల్ కలెక్షన్స్ సాదించనుంది యానిమల్ మూవీ. దీంతో ఈ మూవీ మేకర్స్ కు భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.