Animal Day1 Collections: బాలీవుడ్పై సందీప్ దండయాత్ర.. యానిమల్ ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్

Animal Day1 Collections: బాలీవుడ్పై సందీప్ దండయాత్ర.. యానిమల్ ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్

టాలీవుడ్ వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy Vanga) తెరకెక్కించిన యానిమల్(Animal) మూవీ భారీ అంచనాల మధ్య నిన్న(డిసెంబర్ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో  మొదటి రోజు రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ.

అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే కలెక్షన్ల దుమ్ములేపిన యానిమల్… ఫస్ట్ డే వంద కోట్లకు పైగా వసూళ్లు చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా. ఫస్ట్ డే దాదాపు రూ.120 కోట్లు కొల్లగొట్టినట్టుగా సమాచారం. కేవలం  ఇండియాలోనే దాదాపు రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మార్కెట్ వారీగా చూస్తే.. హిందీలో రూ.50 కోట్లు, తెలుగులో రూ.10 కోట్లు, కర్నాటక, తమిళ్, కేరళ కలిపి మొత్తంగా రూ.60 కోట్లకు పైగా నెట్‌ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. ఇక యానిమల్ సినిమాకు రూ.200 కోట్ల బడ్జెట్ అవగా.. రూ.210 కోట్ల టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర యానిమల్ హవా చూస్తుంటే.. రూ.210 కోట్ల బ్రేక్ ఈవెన్ ను ఈ వీకెండ్ లో దాటేసి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టేలా ఉంది. అంతేకాదు.. ఈ సినిమా రణ్బీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలువనుంది. రానున్న రోజుల్లో మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది యానిమల్.