ఆసియా షూటింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో అనీష్‌‌‌‌‌‌‌‌కు బ్రాంజ్‌‌‌‌‌‌‌‌

ఆసియా షూటింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో అనీష్‌‌‌‌‌‌‌‌కు బ్రాంజ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌ అనీష్‌‌‌‌‌‌‌‌ భన్వాలా ఆసియా షూటింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ను గెలిచాడు. బుధవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ 25 మీటర్ల ర్యాపిడ్‌‌‌‌‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌ పిస్టల్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో అనీష్‌‌‌‌‌‌‌‌ 23 పాయింట్లతో మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. ఇండియన్‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌కు ఇది మూడో ఆసియా చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ కావడం విశేషం. 50 మీటర్ల రైఫిల్‌‌‌‌‌‌‌‌ ప్రోన్‌‌‌‌‌‌‌‌ జూనియర్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో అడ్రియన్‌‌‌‌‌‌‌‌ కర్మాకర్‌‌‌‌‌‌‌‌, జూనియర్‌‌‌‌‌‌‌‌ మెన్స్‌‌‌‌‌‌‌‌ 25 మీటర్ల ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌పీ టీమ్‌‌‌‌‌‌‌‌ స్వర్ణాలు సాధించాయి. 50 మీటర్ల రైఫిల్‌‌‌‌‌‌‌‌ ప్రోన్‌‌‌‌‌‌‌‌లో బాబు సింగ్‌‌‌‌‌‌‌‌ పన్వర్‌‌‌‌‌‌‌‌ (621.3) బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ నెగ్గాడు. టీమ్‌‌‌‌‌‌‌‌ విభాగంలో బాబు–నికితా (622.5) గోల్డ్‌‌‌‌‌‌‌‌ సాధించారు.