తెలంగాణ‌లో మ‌రో జాబ్ నోటిఫికేష‌న్ రిలీజ్

తెలంగాణ‌లో మ‌రో జాబ్ నోటిఫికేష‌న్ రిలీజ్
  • జులై 15 నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌
  • ఆగస్టు 14 వరకు చివరి తేదీ

హైదరాబాద్: ఖాళీగా ఉన్న వైద్య ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో భాగంగా మొత్తం 1,326 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ ప్రకారం ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.  సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు(పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ కేర్) 751, ట్యూటర్ పోస్టులు 357, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (వైద్య విధాన్) 211, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (ప్రివెంటివ్ మెడిసిన్) 7 పోస్టులు ఉన్నాయి.  జులై 15 నుంచి ఆగస్టు 14 వరకు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం ఉంది.