అఖిల్, భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్స్‌లో మురళీ కిషోర్ అబ్బూరు రూపొందిస్తున్న చిత్రం ‘లెనిన్’. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. శుక్రవారం ‘సోల్ ఆఫ్ లెనిన్’ అనే మరో పాటను విడుదల చేశారు. తమన్ కంపోజ్ చేసిన ఈ పాటను కుమార వాగ్దేవి పాడారు.
‘‘ప్రతి పూట పసితనాలే నీ వీర కథ వినాల.. సరిలేరు అనుకునేలా అడుగే కదపరా.. సగపాలు మరిచిపోయే సమరాలు సమసిపోయే.. నినుచూసి వణికిపోగా రణమే జరపరా.. కణకణము ఒక గణమై.. అణువణువు ఆయుధమై..” అంటూ కళ్యాణ చక్రవర్తి రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి.
‘ప్రేమ కంటే గొప్ప యుద్ధం ఏదీ లేదు’ అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ పాటలో తమ ప్రేమను దక్కించుకునేందుకు అఖిల్, భాగ్యశ్రీ చేస్తున్న పోరాటాన్ని చూపించారు. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. జూన్ 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
