
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ‘దేవదాసు’ సినిమా ఎంతటి సంచలనమో తెలిసిందే. భారతీయ సినిమాలో దేవదాసు ఒక మైలురాయి. అది ఇప్పటికీ తెలుగు సినీ అభిమానుల్లో ఒక భావోద్వేగం. అంతేకాకుండా ఒక బాధ మరియు కవిత్వంతో కూడిన ఒక ప్రేమ. ఈ క్లాసిక్ ఫిల్మ్ రిలీజై (1953 జూన్ 26న) నేటికీ 72 సంవత్సరాలు.
ఈ సందర్భంగా అక్కినేని ప్రొడక్షన్ హౌస్ 'అన్నపూర్ణ స్టూడియోస్' స్పెషల్ వీడియో షేర్ చేసింది. ఇందులో అక్కినేని నటనను గుర్తుచేసుకుంటూ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. భగ్న హృదయుడి పాత్రపై అక్కినేని ఇప్పటికీ చెక్కు చెదరని ముద్ర వేశారని అన్నపూర్ణ స్టూడియోస్ వీడియో ద్వారా తెలిపింది.
𝗗𝗲𝘃𝗮𝗱𝗮𝘀𝘂 A milestone in Indian cinema, that still echoes with emotion, pain, and poetry. 72 years on, its legacy stands unshaken.#Devadasu #ANR #Savitri #SVR #Lalitha #DL #VedantamRaghavayya #Chakrapani #BSRanga #PVNarayana pic.twitter.com/vAbesmvT88
— Annapurna Studios (@AnnapurnaStdios) June 26, 2025
వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో..అక్కినేని నాగేశ్వరరావు (దేవదాసు) పాత్ర పోషించగా.. నటి సావిత్రి (పార్వతిగా),యస్.వీ.రంగారావు (జమీందారు నారాయణ రావుగా) నటించి ఆకట్టుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే తమ పాత్రలో జీవించేశారు. అలా ఎన్ని సంవత్సరాలు గడిచినా.. కొన్ని కథలు నిత్యనూతనంగా ఉంటాయనడంలో దేవదాస్ ఎప్పటికీ ముందుంటుంది.
ఇక ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ కూడా తెలుగునాట మ్రోగుతూనే ఉన్నాయి. అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా, జగమే మాయ బ్రతుకే మాయ, కుడి ఎడమైతె పొరపాటు లేదోయ్, ఓడి పోలేదోయ్ వంటి పాటలు సినీ చరిత్ర ఉన్నంతకాలం ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతాయి. ఈ సినిమా దర్శకుడైన వేదాంతం రాఘవయ్య చిత్రీకరణ చాలా భాగం రాత్రుళ్ళే చేశారు. దీని వలన నాగేశ్వరరావుకు సరైన నిద్రలేక కళ్ళు ఉబ్బెత్తుగా తయారయి తాగుబోతులాగా సహజంగా కనిపించారు.
ఇకపోతే.. ఎన్నార్ నటించిన పది క్లాసిక్ సినిమాలను గుర్తుచేసుకుంటే.. 'దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, భార్యాభర్తలు, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, సుడిగుండాలు, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, మనం చిత్రాలు ఉంటాయి. ఈ తరం వాళ్ళు దేవదాసు చూడకపోతే చూసేయండి.
For the #ANR100 Centenary, bought tickets and Watched the Classic #Devadasu in a theater. Absolute Masterclass from the Legendary #ANR & Mahanati Savitri garu as his ‘Paru’ . Even Lalitha garu as Chandramukhi or as he calls her - ‘Ammi’ , was a class apart.
— Adivi Sesh (@AdiviSesh) September 22, 2024
So much of what we… pic.twitter.com/8Qm4teRIHF